సబ్ రిజిస్టర్ కార్యాలయంపై ఏసీబీ దాడులు

ACB Raids: మంచిర్యాల‌ సబ్ రిజిస్టర్ కార్యాలయంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేశారు. శుక్ర‌వారం ఈ దాడులు జ‌రిగాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అధికారులు చేపడుతున్న పనులపై ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు అందటంతో ఈ దాడులు చేశారు. ఏసీబీ డీజీ అదేశాలతో ఏసీబీ డీఎస్పీ మధు ఆధ్వర్యంలో సిబ్బంది ఈ దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది అధికారులు సిబ్బంది ఫోన్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కార్యాలయ అధికారులు, సిబ్బంది ఫోన్లలో నగదు బదిలీ యాప్‌ల‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ అధికారులు లంచాన్ని డబ్బు, వస్తు, సేవ రూపంలో అడిగితే ప్రజలు వెంటనే 1064 నెంబర్ కు ఫోన్ చేయాలని సూచించారు. ఈ ఫోన్ నెంబర్ ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటుందని చెప్పారు.

క్షుణ్ణంగా తనిఖీలు

ఈ దాడులతో అధికారులు, కార్యాల‌య సిబ్బందిలో కలకలం సృష్టించింది. మార్ట్ గేజీలు, వెంచర్లు, అపార్ట్మెంట్ల రిజిస్ట్రేషన్లు తదితర కార్యకలాపాలతో నిత్యం జనాలతో కిటకిటలాడే సబ్‌ రిజిస్టర్ కార్యాలయం ఏసీబీ అధికారుల దాడులతో వెల‌వెల‌పోయింది. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో ఒక్కసారిగా ఏసీబీ బృందం సబ్ రిజిస్టర్ కార్యాలయంపై దాడులు చేశారు. కార్యాలయంలోని డాక్యుమెంట్ లతోపాటు ఫైళ్లను సైతం ఏసీబీ అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు.

తాళాలు వేసి వెళ్లిపోయిన డాక్యుమెంట్ రైటర్లు
మంచిర్యాల సబ్ రిజిస్టర్ కార్యాలయం పై ఏసీబీ బృందం సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలియడంతో ఆ ప్రాంతంలో ఉన్న డాక్యుమెంట్ రైటర్స్ కార్యాలయాలకు హుటా హుటిన తాళాలు వేసి అక్కడ నుండి వెళ్లిపోయారు. అప్పటివరకు పలు రిజిస్ట్రేషన్ల పనులపై డాక్యుమెంట్ రైటర్ల వద్దకు వచ్చిన వారిని అక్కడినుంచి పంపించి డాక్యుమెంటు రైటర్లు తమ షాపులకు తాళాలు వేసి పరిసర ప్రాంతాలలో కనిపించకుండా వెళ్లిపోయారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like