సింగ‌రేణి ఎన్టీపీసీ ఒప్పందం

Singraeni:పునరుద్పాదక ఇంధన రంగంలో సింగరేణి(Singareni) సంస్థ‌ పెద్ద ఎత్తున విద్యుత్ ప్రాజెక్టులను చేపట్టనుంది. ఈ నేపథ్యంలో ఎన్టీపీసీ(NTPC), అనుబంధ కంపెనీ ఎన్జీఈఎల్ (ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్)తో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సంద‌ర్భంగా సింగరేణి సీఎండీ బలరామ్(Singareni CMD Balaram) మాట్లాడుతూ సింగరేణి వ్యాపార విస్తరణ చర్యల్లో భాగంగా పలు పునరుద్పాదక ఇంధన రంగంలో ప్లాంట్లను నెలకొల్పాలని నిర్ణయించిందన్నారు. జాతీయ స్థాయిలో విద్యుత్పాదనలో దశాబ్దాల అనుభవం ఉన్న ఎన్టీపీసీ సహకారాన్ని తీసుకోదలచామని, ఎన్టీపీసీ సంస్థ గ్రీన్ ఎనర్జీ ఉత్పాదన కోసం ఏర్పాటు చేసిన ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ సంస్థతో కీలక ఒప్పందం కుదుర్చుకున్నామని వెల్ల‌డించారు.

సింగరేణి మేడిపల్లి ఓపెన్ కాస్ట్ వద్ద 500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్ ఏర్పాటుతో పాటు, సోలార్ విద్యుత్తు 5 వేల మెగావాట్లకు పెంచాలని నిర్ణయించిందన్నారు. మణుగూరు వద్ద జియో థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని యోచిస్తోందని తెలిపారు. గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ కూడా నిర్మించాలన్న లక్ష్యంగా ముందుకు పోతున్నామన్నారు. ఎన్టీపీసీతో అనుబంధ సంస్థ ఎన్జీఈఎల్ కంపెనీ తోనూ ఒప్పందం కుదుర్చుకోవడం శుభ పరిణామం అన్నారు.

గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ ల ఏర్పాటులో సాంకేతిక సాయం, ఉమ్మడి భాగస్వామ్యం అంశం కూడా పరిశీలిస్తున్నామన్నారు. భవిష్యత్ లో సింగరేణి గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ ల ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్తును విక్రయంలోనూ ఎస్టీపీసీ సహకారం తీసుకోనున్నామని తెలిపారు. ఎన్టీపీసీ అనుబంధ సంస్థ ఎన్ జీ ఈ ఎల్ ఉన్నతాధికారి బిజినెస్ డెవలప్మెంట్ హెడ్ బిమల్ గోపాలాచారి, హెడ్ (సివిల్ ఇంజినీరింగ్) ఆర్.ఆర్.మౌర్య మాట్లాడుతూ సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తితో పాటు గ్రీన్ ఎనర్జీ రంగంలోకి కూడా ప్రవేశించడం ఆహ్వానించదగ్గ పరిణామన్నారు. సింగరేణి డైరెక్టర్ ఈ అండ్ ఎం ఎం. తిరుమలరావు, ఈడీ (ఎస్టీపీపీ) చిరంజీవి , జీఎం (కోఆర్డినేషన్, మార్కెటింగ్) తాడబోయిన శ్రీనివాస్, జీఎం విశ్వనాథ రాజు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like