రేపు సింగరేణిలో డయల్ యువర్ సీఎండీ
సింగరేణి(Singareni) సంస్థలో శనివారం సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు “డయల్ యువర్ సీఎండీ కార్యక్రమం”(Dial Your CMD Program) నిర్వహించనున్నారు. ఉత్పత్తి, ఉత్పాదకత పెంపుదల, రక్షణ, వైద్య సేవల మెరుగుదల వంటి అంశాలపై సింగరేణి సీఎండీ ఎన్. బలరామ్(Singareni CMD N. Balaram) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. కార్యక్రమంలో సింగరేణి వ్యాప్తంగా ఉన్న అన్ని ఏరియాల కార్మికులు పాల్గొనవచ్చని, సింగరేణి సంస్థ ఉత్పత్తి, ఉత్పాదకత పెంపుదల, రక్షణ, వైద్యసేవల పెంపుదలకు నిర్మాణాత్మక సూచనలు, సలహాలు ఫోన్ ద్వారా పంచుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నదలచిన వారు 040-23311338 నెంబర్ కు కాల్ చేయాల్సి ఉంటుందని తెలిపారు.