తెలంగాణలో డీసీసీ అధ్యక్షులు వీరే
DCC:తెలంగాణ డీసీసీ లకు కొత్త అధ్యక్షులను ఏఐసీసీ ప్రకటించింది. 30 జిల్లాలకు డీసీసీ అధ్యక్షులను నియమించి వారి పేర్లను విడుదల చేసింది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) పరిధిలోని జిల్లాల కాంగ్రెస్ కమిటీలకు (DCC) నూతన అధ్యక్షులను నియమించారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడి ఆమోదం మేరకు ఈ నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపారు.
ఆదిలాబాద్-నరేష్ జాదవ్
అసిపాబాద్-ఆత్రం సుగుణ
భద్రాద్రి కొత్తగూడెం-తోట దేవి ప్రసన్న
భువనగిరి-బీర్ల ఆయిలయ్య(ప్రభుత్వ విప్)
గద్వాల్- ఎం రాజీవ్ రెడ్డి
హన్మ కొండ-ఇనగాల వెంకట్ రామిరెడ్డి(కార్పోరేషన్ ఛైర్మన్)
జగిత్యాల-జి.నన్నయ్య
జనగామ-లకవత్ ధన్వంతి
జయశంకర్ భూపాలపల్లి-భట్టు కరుణాకర్
కరీంనగర్-మేడిపల్లి సత్యం(ఎమ్మెల్యే)
కామారెడ్డి-మల్లికార్జున్ ఆలే
కరీంనగర్ కార్పొరేషన్-అంజన్ కుమార్
ఖైరతాబాద్-మోత రోహిత్
నిర్మల్ -వెడ్మ బొజ్జు
కొమురం భీమ్-ఆత్రం సుగుణ.
మంచిర్యాల-పిన్నింటి రఘునాథ్ రెడ్డి