ఓడిపోతానని చనిపోయిండు.. ఫలితాల్లో గెలిచిండు..
Telangana election results:ఎన్నికల ఖర్చులకు డబ్బులు లేవని, పోటీలో నిలబెట్టిన వారు తనకు మద్దతు పలకడం లేదనే మనస్తాపంతో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, ఫలితాల్లో మాత్రం గెలుపొందారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం పీపడ్‌పల్లిలో చోటు చేసుకుంది.
ఎన్నికల ప్రచారానికి చేతిలో డబ్బులు లేకపోవడం, ఎన్నికల్లో పోటీకి ప్రోత్సహించిన వారు మౌనంగా ఉండటం, అంతేకాకుండా వారు ఇతరులకు మద్దతు తెలుపుతుండటంతో తనకు ఓటమి తప్పదేమోనని నాలుగు రోజులుగా మానసికంగా కుంగిపోయిన అభ్యర్థి చాల్కి రాజు ఒంటరిగా ఉండిపోయాడు. ఇదే కారణంతో అయ్యప్ప మాలలో ఉన్న రాజు ఆదివారం రాత్రి చెట్టుకు టవల్‌తో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఆదివారం వెలువడిన ఫలితాల్లో రాజు 8 ఓట్ల తేడాతో ప్రత్యర్థిపై విజయం సాధించారు. దీంతో ఆ గ్రామంలో మరోసారి ఎన్నికలు నిర్వహించనున్నారు.