పులిని బంధించిన అటవీశాఖ అధికారులు
Forest department officials capture tiger: ఇద్దరు వ్యవసాయ కూలీలను పొట్టనపెట్టుకున్న పులి(tiger)ని అధికారులు ఎట్టకేలకు బంధించారు. దాదాపు రెండు నెలల వేట తర్వాత ఈ పులిని పట్టుకోవడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. మహారాష్ట్ర(Maharashtra)లోని చంద్రాపూర్(Chandrapur district)జిల్లాలో ఈ మధ్య కాలంలో ఓ పులి మ్యాన్ ఈటర్‌గా మారింది. దీంతో తరచూ ప్రజలపై దాడులు చేస్తోంది. ఇద్దరు వ్యవసాయ కూలీలను సైతం పొట్టన పెట్టుకుంది. ఈ నేపథ్యంలోనే స్థానికంగా ఉన్న ప్రజలు ఆ పులిని పట్టుకోవాలని చాలా సార్లు ఆందోళనలు సైతం నిర్వహించారు.
రాస్తారోకోలు, అధికారులకు వినతిపత్రాలు సైతం సమర్పించారు. అధికారులు సైతం ఈ పులిని పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. చివరకు చంద్రాపూర్ జిల్లా పొంబూర్ణ తాలూకా కెమారా అటవీ ప్రాంతంలో బోను ఏర్పాటు చేశారు. చంద్రపూర్ ఫారెస్ట్ డివిజన్ నుండి ఒక రాపిడ్ రెస్పాన్స్ యూనిట్, వెటర్నరీ అధికారి డాక్టర్ కుందన్ పోడ్చల్వర్, RFO కిషోర్ గౌర్కర్ పర్యవేక్షణలో ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించారు. పులిని బోనులో ఉంచి చంద్రపూర్‌లోని ట్రాన్సిట్ ట్రీట్‌మెంట్ సెంటర్ తరలించినట్లు అధికారులు తెలిపారు.