మ‌హంకాళి దేవాల‌యంలో జంతుబ‌లి నిషేధం

Chandrapur Mahankali Temple:మహారాష్ట్ర(Maharashtra)లోని చంద్రపూర్ మహంకాళి దేవాలయంలో ఈ నెల 29 నుంచి జనవరి 3వ తేదీ వ‌ర‌కు జంతు బ‌లుల నిషేధం విధిస్తున్న‌ట్లు మహంకాళి దేవాలయ కమిటీ చైర్మన్ సునీల్ నాందేవ్ మహాకాళి తెలిపారు. ఆ తేదీల్లో దేవాలయంలో మహా చండీయాగం(Maha Chandi Yagam) నిర్వ‌హిస్తున్నామ‌న్నారు. ఈ చండీయాగానికి తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, ఒడిస్సా నుంచి భక్తులు ఎక్కువ సంఖ్యలో వ‌స్తార‌ని చెప్పారు. భక్తులకు ఎలాంటి అవసాకార్యం కలగకుండా ఉండాలని అన్ని ఏర్పాట్లు చేశామ‌న్నారు. ఈ మేరకు చండీయాగం జరుగుతున్న రోజుల్లో ఎలాంటి బ‌లులు ఇవ్వరాదని స్ప‌ష్టం చేశారు. అదే స‌మ‌యంలో ఆలయం పరిస‌ర‌ ప్రాంతాల్లో మాంసాహారం వంటలు రాదని తినరాదన్నారు. ఈ విష‌యాన్ని భ‌క్తులు గ‌మ‌నించాల‌ని వెల్ల‌డించారు. డిసెంబర్ 29 నుంచి జనవరి 3 వ తేదీ వరకు ఈ సూచ‌న ఖ‌చ్చితంగా పాటించాలని భ‌క్తుల‌కు మ‌రోమారు విజ్ఞ‌ప్తి చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like