రైతుల‌కు ఇబ్బంది లేకుండా చూడండి

-సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తా
-నీటి పారుదల శాఖ అధికారులతో ఎమ్మెల్యే వెడ్మ‌బొజ్జు

కడెం, సదర్ మాట్ ప్రాజెక్టు నుండి చివరి ఆయకట్టు వరకు నీరు అందించి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండ చూడాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ‌బొజ్జు అధికారులకు సూచించారు. ఉట్నూర్ క్యాంపు కార్యాలయంలో నీటి పారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా అధికారులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. కడెం ప్రాజెక్టు ఎడమ కాలువ మరమ్మతులు, అట‌వీ ప్రాంతాల ద్వారా ప్రవహించే కాల్వల మరమ్మతులకు అట‌వీ శాఖ అనుమతుల ఇబ్బందులను ఎమ్మెల్యేకు సూచించారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కడెం ప్రాజెక్టుకు మహ‌ర్దశ కోసం కృషి చేస్తాన‌ని అన్నారు. అలాగే ఇతర సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like