మేడారం జాత‌ర‌కు రావాల‌ని సీఎంకు ఆహ్వానం..

CM invited to Medaram Jathara:ఈ నెల 28 నుంచి ప్రారంభమవుతున్న అతిపెద్ద ఆదివాసీ గిరిజన ఆధ్యాత్మిక వేడుక, మేడారం సమ్మక్క – సారలమ్మ మహాజాతరలో పాల్గొనాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందింది. మంత్రులు కొండా సురేఖ, ధనసరి అనసూయ సీతక్క, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మేడారం ఆలయ పూజారులతో కలిసి అసెంబ్లీ ఛాంబర్‌లో ముఖ్యమంత్రిని క‌లిశారు. జాతర ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్య‌మంత్రి మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర పోస్టర్ ఆవిష్కరించారు.

ఐన‌వోలు బ్రహ్మోత్స‌వాల‌కు రండి..
హనుమకొండ జిల్లా ప్రఖ్యాత ఐనవోలు మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. అసెంబ్లీ ఛాంబర్‌లో మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు ఆలయ పూజారులతో కలిసి ఆహ్వాన పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు ముఖ్యమంత్రికి ఆశీర్వచనం అందించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఐనవోలు మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 13 నుంచి ప్రారంభం కానున్నాయి,

 

Get real time updates directly on you device, subscribe now.

You might also like