ఎమ్మెల్యే అనుచరుడి బూతు పురాణం
నాపై కబ్జాల వార్తలు రాస్తావా..? లం… కొడకా అంటూ బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ అనుచరుడు కారుకూరి రాంచందర్ ఓ జర్నలిస్టుపై బూతుపురాణంతో విరుచుకుపడ్డాడు. బెల్లంపల్లి ఎన్టీవీ రిపోర్టర్ రమేష్‌ను చంపేస్తానంటూ బెదింరిపులకు దిగాడు. కబ్జాల వార్త రాస్తావా..? అంటూ ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్లు తిట్టాడు రాంచందర్.. కుటుంబ సభ్యులను ప్రస్తావిస్తూ తిట్టూ అంతు చూస్తానంటూ బెదిరించాడు. బొక్కలిరగ్గొడుతా అంటూ చెప్పలేని భాష ఉపయోగించాడు.. భూమి ఎవడు ఆపాడు…? బట్టలిప్పి రోడ్డు మీద తంతా.. అంటూ పత్రికల్లో రాయలేని విధంగా మాట్లాడాడు.
చర్యలు తీసుకోవాలి…
జర్నలిస్టును బూతులు తిట్టడమే కాకుండా, చంపుతానని బెదిరించిన ఎమ్మెల్యే అనుచరుడు కారుకూరి రాంచందర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేశాయి.