ఆడబిడ్డలకు అండగా ఉంటాం
ఆడబిడ్డలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని మంచిర్యాల ఎమ్మెల్యే సతీమణి, మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అన్నారు. కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బతుకమ్మ పండుగకు ఇవ్వవలసిన చీరలను సంక్రాంతి పండుగ సందర్భంగా ఇస్తున్నామని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకి ఆరోగ్య బాగోలేక ఈ బతుకమ్మ పండుగకు చీరలు పంపిణీ చేయలేదని చెప్పారు. ఇప్పుడు ఆయన ఆరోగ్యం బాగవడంతో సంక్రాంతి సందర్భంగా చీరలను పంపిణీ చేస్తున్నామని చెప్పారు. మంచిర్యాల కార్పోరేషన్ పరిధిలోని (నస్పూర్ మున్సిపాలిటీ) లోని శ్రీరాంపూర్ కాలనీ ప్రగతి స్టేడియంలో 3,4,5,6,7,9,16,17 వార్డుల్లోని ఆడపడుచులందరికీ చీరలను పంపిణీ చేశారు.