ఎమ్మెల్యే అనుచరుడిపై చర్యలు తీసుకోవాలి
విలేఖరిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే అనుచరుడు, కాంగ్రెస్ నాయకుడు కారుకూరి రాంచందర్ ను అరెస్టు చేయాలని జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు. బెల్లంపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నేతలు అధికారం అందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఎమ్మెల్యే అండగా ఉన్నాడని బూతులు మాట్లాడం ఏమిటని ప్రశ్నించారు. ఒక నాయకుడిగా ఉండి అలాంటి అసభ్య పదాలు మాట్లాడితే ఇక ప్రజలకు ఏం న్యాయం చేస్తారని దుయ్యబట్టారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.