కార్మికుల హక్కులు రావాలంటే… టీబీజీకేఎస్ గెలవాలే..
TBGKS :కార్మికుల హక్కులు సాధించుకోవాలంటే తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గెలవాలని ఆ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి అన్నారు. శ్రీరాంపూర్ ఏరియా CHP లో TBGKS యూనియన్ ముఖ్య కార్యకర్తల, నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో ఆయన సహకారంతో సింగరేణి కార్మికుల కోసం అనేక సంక్షేమ పథకాలను, హక్కులను సాధించామని వివరించారు. ప్రస్తుత గుర్తింపు సంఘాలైన AITUC, INTUC లు ఎన్నికల హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యాయని, సింగరేణి ప్రైవేటీకరణ, రాజకీయ జోక్యం పెరుగుతున్నా వారు పట్టించుకోవడం లేదని విమర్శించారు. సింగరేణిని కాపాడుకోవడానికి, కొత్త హక్కులను సాధించడానికి రానున్న రోజుల్లో TBGKS ని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.
సమావేశంలో 25 మంది కార్మికులు కేతిరెడ్డి సురేందర్ రెడ్డి సమక్షంలో TBGKS కండువా కప్పుకొని అధికారికంగా చేరారు. వీరిలో గండి సమ్మయ్య, ఎండీ. ఫకూర్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో కేతిరెడ్డి సురేందర్ రెడ్డితో పాటు ఏరియా వైస్ ప్రెసిడెంట్ బండి రమేష్, సెంట్రల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పానుగంటి సత్తయ్య, ఏరియా సెక్రటరీలు బుస్స రమేష్, మహిపాల్ రెడ్డి, సీహెచ్‌పీ సెక్రటరీ అందె రాజ్ కుమార్ పాల్గొన్నారు.