మర్లవడ్డ సింగరేణి
సింగరేణిలో సమ్మె విజయవంతంగా కొనసాగుతోంది. సమ్మెలో 40వేల మంది రెగ్యులర్,25వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొంటున్నారు. కార్మికుల సమ్మెతో 23 భూగర్భ, 19 ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.
ప్రైవేటు వ్యక్తులకు బొగ్గు గనులను అప్పగించవద్దంటూ సింగరేణి కార్మికులు ఆందోళనబాట పట్టారు. కార్మికులు విధులు హాజరుకాకపోవడంతో గనులు బోసిపోతున్నాయి. సమ్మెను విజయవంతం చేయాలంటు కార్మికసంఘాల ర్యాలీ చేపట్టాయి.సింగరేణికి చెందిన కళ్యాణి ఖని-6, కోయగూడెం బ్లాక్-3, సత్తుపల్లి బ్లాకు-3, శ్రావణ్‌పల్లి బొగ్గు బ్లాకులను ప్రైవేటుపరం నుంచి ఆపి తిరిగి సంస్థకు అప్పగించాలంటూ టీబీజీకేఎస్ సహా జాతీయ సంఘాలైన ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, హెచ్ఎమ్ఎస్, సీఐటీయూ, బీఎమ్ఎస్లు సమ్మెకు పిలుపునిచ్చాయి. బొగ్గు గనుల ప్రైవేటుపరం మరో 10 డిమాండ్లపై సింగరేణి యాజమాన్యంతో కార్మిక సంఘాలు చర్చలు జరిపినా ప్రయోజనం లేకపోవటంతో…. నేటి నుంచి మూడ్రోజుల పాటు సమ్మె నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే విధులు బహిష్కరించిన కార్మికులు.. కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు.