వారిపై విషప్రచారం బాధాకరం
మహిళా ఐఏఎస్ అధికారులపై జరుగుతున్న దుష్ప్రచారం బాధాకరమని ఐఎన్టీయూసీ (INTUC) మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు రాంశెట్టి నరేందర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో నిబద్ధతతో పనిచేస్తున్న మహిళా ఐఏఎస్ అధికారుల ప్రతిష్టను దెబ్బతీసేలా జరుగుతున్న ప్రచారం విచారకరమని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి అసభ్యకర వ్యాఖ్యలు, ప్రచారాలు ప్రజాస్వామ్య విలువలను మంటగలిపేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో, పేదలకు అండగా నిలవడంలో ఐఏఎస్ అధికారులు కీలక పాత్ర పోషిస్తున్నారని గుర్తుచేశారు.
ప్రభుత్వం యొక్క కీర్తి ప్రతిష్టలను తగ్గించాలనే ఉద్దేశంతోనే ఇలాంటి వ్యతిరేక శక్తులు పని చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. అధికారులపై విష ప్రచారం చేస్తున్న వారిని గుర్తించి, చట్టపరంగా కఠినంగా శిక్షించాలని రాంశెట్టి నరేందర్ డిమాండ్ చేశారు.