బ్రహ్మోస్ కా బాప్..
R-37M Missile:బ్రహ్మెస్(Brahms) ఈ పేరు చెబితే చాలు… శత్రుదేశాలకు వణుకే.. ఆపరేషన్ సిందూర్‌లో మిసైల్ వాడిన తీరు చూసి దానిని తయారు చేసిన రష్యా యుద్ధనిపుణులే ఆశ్చర్యపోయారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆ దెబ్బకు పాకిస్తాన్ లబోదిబోమంటూ కాళ్ల బేరానికి వచ్చింది. ఇక ఇప్పుడు దానికి మంచిన మరో అస్త్రం మన చేతికి రాబోతోంది. అదే R-37M… ఇది యుద్దరంగంలో మరో గేమ్ చేంజర్ కానుంది.
భారత్‌లో విధ్వంసం సృష్టించేందుకు శత్రుదేశాలు గగనతలం నుంచే ప్రయోగించే క్షిపణులు, డ్రోన్లను అడ్డుకునే వ్యవస్థ ఒక్కటే ఉంటే సరిపోదు. శత్రుదేశం ఆట కట్టించేందుకు గగనతనం నుంచి దాడులు చేసే సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం భారత్ అదే పని చేస్తోంది. భారత ఫైటర్‌జెట్ పైలట్లు శత్రుదేశ భూభాగంలోకి అడుగుపెట్టకుండా సుదూర లక్ష్యాలను ధ్వంసం చేసే అధునాతన లాంగ్ రేంజ్ మిస్సైళ్లను సమకూర్చుకునే ప్రయత్నాలు సాగిస్తోంది. ఈ క్రమంలో భారతదేశానికి తన అత్యాధునిక R-37M హైపర్‌సోనిక్ లాంగ్-రేంజ్ ఎయిర్-టు-ఎయిర్ మిస్సైల్‌ను అందించేందుకు రష్యా ముందుకొచ్చింది.
ఇది వస్తే శత్రువుకు చెమటలే..
ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన లాంగ్ రేంజ్ ఎయిర్-టు-ఎయిర్ మిస్సైల్‌లలో ఇది ఒకటి. రష్యా వింపెల్ డిజైన్ బ్యూరో అభివృద్ధి చేసిన ఈ మిస్సైల్, శత్రు విమానాలను సుమారు 300 – 400 కిలోమీటర్ల దూరం నుంచే టార్గెట్ చేయగలదు. దీని హైపర్‌సోనిక్ వేగం మాక్ 6 (ధ్వని వేగం కంటే 6 రెట్లు). ఈ మిస్సైల్ ప్రధానంగా శత్రుదేశానికి చెందిన AWACS (ఎయిర్‌బోర్న్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్), ట్యాంకర్ విమానాలు, ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను నాశనం చేస్తుంది. మన మన దేశంలోనే ఉండి దీనిని ప్రయోగించే అవకాశం ఉంటుంది. తద్వారా మన ఫైటర్ జెట్లు, పైలట్లు మరింత సురక్షితంగా ఉంటూ శత్రుదేశపు లక్ష్యాలను ధ్వంసం చేయవచ్చు.
వెంటాడి.. వేటాడుతుంది..
“ఫైర్ అండ్ ఫర్గెట్” సామర్థ్యం. అంటే లాంచ్ చేసిన తర్వాత మిస్సైల్ తనంతట తానుగా లక్ష్యాన్ని ట్రాక్ చేస్తూ ధ్వంసం చేస్తుంది. ఉదాహరణకు శత్రుదేశపు యుద్ధ విమానం వేగంగా కదులుతూ తప్పించుకునే ప్రయత్నం చేసినా సరే.. దాన్ని వెంటాడి పేల్చేయగలదు. పాకిస్తాన్ ఉపయోగించే F-16 , చైనా ఉపయోగించే J-10C వంటి విమానాలతో పోలిస్తే ఇది గణనీయమైన ఆధిక్యత అందిస్తుంది. రష్యా ఈ మిస్సైల్‌ను భారతదేశంలో తయారు చేసేందుకు సిద్దమైంది. R-37M పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడానికి Su-30MKI విమానాల రాడార్ (ప్రస్తుత Bars రాడార్), ఫైర్ కంట్రోల్ సిస్టమ్‌లను అప్‌గ్రేడ్ చేయనున్నారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో పరీక్ష
R-37M రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో విజయవంతంగా పరీక్షించారు. Su-35S, Su-30SM2, MiG-31BM విమానాల నుంచి ఈ మిస్సైల్ ను రష్యా ప్రయోగించింది. 2024లో 213 కిలోమీటర్ల దూరంలో ఉక్రెయిన్ MiG-29ని ఈ క్షిపణి కూల్చివేసింది. మొత్తంగా R-37M మిస్సైల్ భారత వైమానిక దళానికి అత్యాధునిక దాడి సామర్థ్యాన్ని, యుద్ధరంగ ఆధిపత్యాన్ని అందిస్తుంది. దీని హైపర్‌సోనిక్ వేగం, లాంగ్ రేంజ్ సామర్థ్యం, అధునాతన గైడెన్స్ సిస్టమ్ శత్రు విమానాలను దూరం నుంచే నాశనం చేయడంలో అపూర్వమైన సామర్థ్యాన్ని ఇస్తుంది.
R-37M సాంకేతిక విశేషాలు
రేంజ్: 300 నుంచి 400 కిలోమీటర్ల వరకు, Beyond Visual Range (BVR) మిస్సైల్‌లలో అగ్రగామి.
వేగం: మాక్ 6 (సుమారు 7,400 కిమీ/గంట), హైపర్‌సోనిక్ సామర్థ్యం.
వార్‌హెడ్: 60 కిలోగ్రాముల హై-ఎక్స్‌ప్లోసివ్ ఫ్రాగ్మెంటేషన్ వార్‌హెడ్, ఇది భారీ విధ్వంసాన్ని సృష్టించగలదు.
బరువు: సుమారు 510 కిలోగ్రాములు.
గైడెన్స్ సిస్టమ్:
ఇనర్షియల్ నావిగేషన్.
మిడ్-కోర్స్ అప్‌డేట్స్ (లాంచింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ నుంచి).
అంతిమ దశలో యాక్టివ్ రాడార్ హోమింగ్.