వెంట‌నే ప్ర‌మోష‌న్లు ఇవ్వండి

పీఓపీ (POP) ప్రమోషన్లు అర్హులైన ఉద్యోగులకు తక్షణమే అందించాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (TBGKS) నేత‌లు డిమాండ్ చేశారు. కొద్ది రోజుల నుంచి పంపు ఆపరేటర్ ప్రమోషన్లు ఇవ్వకుండా యాజ‌మాన్యం కాల‌యాప‌న చేస్తోంద‌ని వారు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అదే స‌మ‌యంలో గుర్తింపు సంఘమైన ఏఐటీయూసీ సైతం నిమ్మకు నీరెత్తినట్టు చూస్తోంద‌ని దుయ్య‌బ‌ట్టారు. నూతనంగా విధుల్లోకి మహిళలకు గని పరిసరాల మీద పూర్తి అవగాహన లేకుండానే షిఫ్ట్ లో పని చేయడం సమంజసం కాదన్నారు. వారికి పూర్తిస్థాయిలో అవగాహన కల్పించిన తర్వాత షిఫ్ట్ లో వేస్తే కంపెనీకి, వారికి కూడా అనువుగా ఉంటుందని తెలిపారు. వారికి కనీస వసతులైన రెస్ట్ రూమ్స్ అటాచ్డ్ బాత్రూమ్స్ కూడా ఏర్పాటు చేసి సాధ్యమైనంత‌ త్వరగా అందించాలని కోరారు.

ఈ డిమాండ్ల‌తో కూడిన మొమోరాండం మేనేజర్ కి అందించారు. ఈ కార్య‌క్ర‌మంలో తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘం పిట్ కార్యదర్శి బొంగు వెంకటేష్, ఏరియా కార్యదర్శి మారిన వెంకటేశ్వర్లు సెంట్రల్ కమిటీ నాయకులు ఓరం కిరణ్, కాయితే స్వామి, కుదిరే మొగులయ్య, షిఫ్ట్ ఇన్చార్జీలు గొల్ల కృష్ణ, సాలిగామ రవి, రాజేశం, అసిస్టెంట్ ఫిట్ కార్యదర్శి మారిన చందర్, మల్లేష్, తిరుపతి, సురేష్, రెడ్డి సంజీవ్, కుమార్, రమేష్, చంద్రశేఖర్, రాజమౌళి, సురేందర్, బిక్షపతి, లక్ష్మీనారాయణ రవి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like