మంత్రికి బిగ్ షాక్..
ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా మాజీ జడ్పి వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయక పోవడంతో ప్రజల్లో వ్యతిరేకత,మంత్రి వివేక్ వెంకటస్వామి ఒంటెద్దు పోకడలు చూడలేక కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన డీసీసీ జిల్లా అధ్యక్షునికి పంపిన లేఖలో పేర్కొన్నారు…
ఇక్కడ మంత్రిగా పని చేస్తున్న వివేక్ వెంకటస్వామి గెలుపు కోసం అసెంబ్లీ ఎన్నికల్లో తనదైన పాత్ర పోషించారు ఆయన.
త్వరలోనే తన అనుచరగణంతో కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపిన మూల రాజిరెడ్డి. BRS లో చేరనున్నట్లు సమాచారం. సుమారు 200 వందల కార్లు , 20 మంది సర్పంచులతో చెన్నూరు నుండి హైదరాబాద్ తెలంగాణ భవన్ వెళ్లి బాల్క సుమన్ ఆధ్వర్యంలో KTR సమక్షంలో గులాబీ గూటికి చేరనున్నారు.