19న ప్రజావాణి రద్దు
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల జిల్లా ప్రజల ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం ‘ప్రజావాణి’కి సంబంధించి జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 19వ తేదీ సోమవారం నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రస్తుతం జిల్లా అధికారులు మున్సిపల్ ఎన్నికల సన్నాహక పనులు, ఎన్నికల నిర్వహణ సంబంధించిన ఇతర విధుల్లో నిమగ్నమై ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం సాధ్యపడదని కలెక్టర్ తెలిపారు.
జనవరి 19న కలెక్టరేట్‌కు ఫిర్యాదులు ఇచ్చేందుకు రావాలని భావించిన ప్రజలు ఈ మార్పును గమనించాలని కోరారు. ఈ నిర్ణయానికి జిల్లా ప్రజలు సహకరించాలని, అధికారుల పని ఒత్తిడిని దృష్టిలో ఉంచుకుని సమన్వయం పాటించాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. తదుపరి ప్రజావాణి కార్యక్రమం ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.