రోడ్డు ప్ర‌మాదంలో న‌లుగురి మృతి

Road Accident:నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో తెల్లవారుజామున ఘోర‌ రోడ్డు ప్రమాదంలో న‌లుగురు మృత్యువాత ప‌డ్డారు. ఆసుప‌త్రిలో ఉన్న బంధువుల‌ను ప‌రామ‌ర్శించి వ‌స్తున్న న‌లుగురు వ్య‌క్తులు మ‌రణించారు. వివ‌రాల్లోకి వెళితే.. భైంసా బస్ డిపో సమీపంలో కారు- కంటైనర్ లారీ ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని సత్ పూల్ బిడ్జి వద్ద  ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్ ను వెనకనుంచి బలంగా ఢీ కొనడంతో కారు నుజ్జునుజ్జు అయింది. డ్రైవర్ తో పాటు మరో ముగ్గురు మృతి అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరు హైదరాబాద్ లోని రెయిన్ బో ఆసుపత్రిలో బంధువుల వారిని పరామర్శించి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. వీరంతా కుబీర్ మండలంలోని కుప్టి గ్రామస్తులు. భోజారం పటేల్(42), కొలిమెల రాజన్న(55), బాబన్న (60), డ్రైవర్ వికాస్(39) మృతి చెందారు. సర్పంచ్ పోతుగంటి గంగాధర్ పరిస్థితి విషమంగా ఉంది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like