అయ్యో పాపం.. మందుబాబులు..
ఆరు జిల్లాలో మద్యం అమ్మకాలు నిలిపివేత

రెండు రోజులుగా మందు దొరక్క మద్యం బాబులు అల్లాడిపోతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో రేపు ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో మొత్తం 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఆరు స్థానాలు ఏకగ్రీవం కావడంతో మిగిలిన ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, మెదక్ మహబూబునగర్ పాత జిల్లా పరిధిలోని మద్యం దుకాణాలకు తాళాలు పడ్డాయి. ఎన్నికల నిబంధనల ప్రకారం ఎన్నికలకు రెండు రోజుల ముందు మద్యం దుకాణాలు మూసి ఉంచాలనే నిబంధన ఉంది. దీంతో బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి శుక్రవారం సాయంత్రం పొలింగ్ ముగిసే వరకు మద్యం దుకాణాలు ముసివేయాలని నిర్ణయించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లుగా ఉన్న జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు మరియు కార్పొరేటర్లు క్యాంపుల్లో ఉన్నా మద్యం అమ్మకాలు నిలిపివేయడంపై మందు బాబులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బెల్ట్ షాపుల్లో ఫుల్..
గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం మద్యం ఫుల్‌గా దొరుకుతోంది. అయితే కాస్తంత రేటు ఎక్కువ. మద్యం షాపులు బంద్ అవుతాయని తెలిసిన బెల్ట్ షాపు యజమానులు ముందుగానే పెద్ద ఎత్తున స్టాక్ తెచ్చుకుని పెట్టుకున్నారు. షాపులు బంద్ ఉండటంతో వీరు రేట్లు పెంచి అమ్ముతున్నారు. మద్యానికి అలవాటు పడ్డ జనం యథావిధిగా రేట్ ఎక్కువైనా సరే కొనుకున్ని తాగుతున్నారు.