మ‌హిళా క‌మిష‌న్‌కు ఫిర్యాదు

త‌న‌ను MIM బెదిరింపుల‌కు గురి చేస్తున్నార‌ని కార్పొరేట‌ర్ ఆకుల శ్రీ‌వాణి శుక్ర‌వారం మ‌హిళాక‌మిష‌న్ కు ఫిర్యాదు చేశారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ మ‌హారాష్ట్రలో ఎన్నిక‌ల సంద‌ర్భంగా అక్బ‌రుద్దీన్ 15 నిమిషాలు అంటూ మాట్లాడుతున్నార‌ని, సంక్రాంతి పండ‌గ సంద‌ర్భంగా ప‌తంగి ఎగ‌రేస్తూ మీరు హిందువుల‌ను గౌర‌వించ‌రు… మీకు మా దేవీ,దేవ‌త‌ల‌పైన గౌర‌వం లేదు.. అలాంటి వ్య‌క్తులు మా హిందూ సంస్కృతికి ద‌గ్గ‌రైన మా ప‌తంగి మీ పార్టీ లోగోగా ఎలా పెట్టుకుంటున్నార‌ని ప్ర‌శ్నించాన‌ని అన్నారు. ఇది నాకు అభ్యంత‌ర‌మ‌ని, నేను ఎన్నిక‌ల క‌మిష‌న్ కు ఫిర్యాదు చేస్తాన‌ని చెప్పాన‌ని తెలిపారు.

అదే స‌మ‌యంలో భోగి సంద‌ర్భంగా మంట‌ల్లో పాత వ‌స్తువుల‌ను ఎలాగైతే భోగి మంట‌ల్లో విసిరేస్తామో…? పాత వాటిని పాత‌గానే ఉంచుతున్న ఎంఐఎం పార్టీని పారేసి హైద‌రాబాద్ భాగ్య‌న‌గ‌రంగా మార్చుకుందామ‌ని తాను మాట్లాడిన‌ట్లు చెప్పారు. ఒక జ‌ర్న‌లిస్టు అడిగిన ప్ర‌శ్న‌కు అస‌దుద్దీన్ ఓవైసీ ఎంపీ అయి ఉండి కూడా మహిళలను చులకనగా, మాటలు మాట్లాడడం మహిళా లోకానికి తీరని అవమానమ‌న్నారు. వాళ్ల ఇండ్ల‌లో నాకు ఏదో స‌మ‌స్య క‌నిపిస్తోంద‌ని, వాళ్ల ఇండ్ల‌లో సింబ‌ల్ లేక‌పోతే నేనేం చేయ‌గ‌ల‌ని మాట్లాడ‌టం ఏమిట‌ని ప్ర‌శ్నించారు. నా త‌మ్ముడు హ్యాండ్‌స‌మ్ అంటూ ఆయ‌న మాట్లాడితే నాకు పంది హ్యాండ్ స‌మ్‌గా ఉంద‌ని తాను మాట్లాడిన‌ట్లు స్ప‌ష్టం చేశారు.

నాకు నిత్యం ఫోన్లనో బెదిరింపులు వ‌స్తున్నాయ‌ని శ్రీ‌వాణి వెల్ల‌డించారు. నిత్యం 15 ఫోన్ కాల్స్ వ‌స్తున్నాయ‌ని తెలిపారామె. తాను పోలీస్‌స్టేష‌న్ వెళ్లి ఫిర్యాదు చేశాన‌ని, పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన త‌ర్వాత బెదిరింపులు మ‌రింతగా పెరిగాయ‌ని ఆమె వెల్ల‌డించారు. అందుకే తాను మ‌హిళా క‌మిష‌న్‌కు ఫిర్యాదు చేశాన‌ని స్ప‌ష్టం చేశారు. అస‌దుద్దీన్‌కు తెలివి ఉంటే తాను ఫిర్యాదు చేసిన అంశాల‌పై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని ఆమె స‌వాల్ విసిరారు. హిజాబ్ ధ‌రించిన మ‌హిళ ప్ర‌ధాని కావాల‌ని చూడాల‌ని ఉందంటూ చెబుతున్నారు…. వీళ్ల ఇంట్లో ఉండే మ‌హిళ‌లనే బ‌య‌ట‌కి రానివ్వ‌ని వీళ్లు ప్ర‌ధానిగా మ‌హిళ‌ల‌ను చూస్తారా..? అంటూ ప్ర‌శ్నించారు.

 

 

 

Get real time updates directly on you device, subscribe now.

You might also like