కొత్త సర్పంచ్ లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి

Training classes for new sarpanches:కొత్త‌గా ఎన్నికైన సర్పంచ్ లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు (District Panchayat Officer Venkateswar Rao) అన్నారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం ముల్కల్ల ఐజా ఇంజనీరింగ్ కళాశాలలో కొత్త‌ సర్పంచ్ లకు నిర్వహించిన శిక్షణ ముగింపు కార్యక్రమంలో మాట్లాడారు. తొలి దశలో 101 మందికి 5 రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహించామ‌న్నారు. సర్పంచ్ లు శిక్షణలో నేర్చుకున్న అంశాలను ప్రజా శ్రేయస్సు దృష్ట్యా వినియోగించాలని తెలిపారు. అనంతరం శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతీ ఒక్కరికి ధృవీకరణ పత్రాలు అందజేశారు.

కార్యక్రమంలో డివిజనల్ పంచాయతీ అధికారి, మాస్టర్ ట్రైనర్, కొమ్మర సతీష్ కుమార్, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు మోహన్, సాయి వెంకట్ రెడ్డి, మండల పంచాయతీ అధికారులు శ్రీపతి బాపు రావు, వేదాల శ్రీనివాస్, బుగ్గరాం శ్రీనివాస్, సతీష్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, మాస్టర్ ట్రైనర్లు అనిల్ కుమార్, వెంకటేష్, మహేష్, సత్యనారాయణ, వెంకటేశ్వర్లు, జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ నరేందర్, పంచాయతీ కార్యదర్శులు సుమన్, నరేందర్, నాగరాజు, జిల్లా పంచాయతీ కార్యాలయ సిబ్బంది వెంకటేష్, ప్రజ్ఞ, రాంకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like