లంచం తీసుకుంటూ ఏసీబీ చిక్కిన సీనియ‌ర్ అసిస్టెంట్‌

ACB Trap:లంచం తీసుకుంటుండగా ఓ సీనియర్​ అసిస్టెంట్​ను ఏసీబీ అధికారులు వ‌ల‌ప‌న్ని పట్టుకున్నారు. ఆదిలాబాద్ (Adilabad) జిల్లా బజార్ హత్నూర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో కటకం విద్యాసాగర్ రెడ్డి సీనియర్ అసిస్టెంట్​గా పనిచేస్తున్నారు. ఓ రైతు సాదాబైనామా ద్వారా 8.35 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్​ చేసుకోవడానికి దరఖాస్తు చేసుకున్నాడు. ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి సీనియర్​ అసిస్టెంట్ విద్యాసాగర్​ రెడ్డి రూ.రెండు లక్షల లంచం డిమాండ్​ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఆ వ్య‌క్తి నుంచి లంచం తీసుకుంటుంగా.. ఏసీబీ అధికారులు వల పన్ని పట్టుకున్నారు. కార్యాలయంలో సోదాలు చేసి, అతడిపై కేసు నమోదు చేసిన‌ట్లు ఏసీబీ DSP మధు మీడియాకు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి కరీంనగర్లోని ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు చెప్పారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like