ఆర్ఎస్ ప్రవీణ్ కు సజ్జనార్ నోటీసులు
బీఆర్‌ఎస్ నేత ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్‌కు హైదరాబాద్ సీపీ సజ్జనార్ నోటీసులు జారీ చేశారు. తనపై చేసిన ఆరోపణలకు నోటీసులు అందిన రెండ్రోజుల్లోపు ఆధారాలు ఇవ్వాలని ప్రవీణ్ కుమార్‌ను సీపీ ఆదేశించారు. విలేకరుల సమావేశంలో సీపీ సజ్జనార్‌పై 7 క్రిమినల్ కేసులున్నాయని ప్రవీణ్‌కుమార్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు సజ్జనార్ విచారణ ఎదుర్కొంటున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఆ రోజు నోటుకు ఓటు కేసులో సజ్జనార్ ఫోన్ ట్యాపింగ్ చేశాడని కేసులు పెట్టారని అన్నారు. ఇప్పుడు అదే సజ్జనార్ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ చేస్తా అంటున్నాడని అన్నారు.