కాంగ్రెస్ జెండా ఎగ‌రాలి

Minister Jupally Krishna Rao:మంచిర్యాల కార్పొరేష‌న్‌తో పాటు ల‌క్ష్సెట్టిపేట మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగ‌రాలని మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) స్ప‌ష్టం చేశారు. బుధ‌వారం మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు(Mancherial MLA Prem Sagar Rao) నివాసానికి వచ్చిన ఆయ‌నకు కాంగ్రెస్ శ్రేణులు, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు స్వాగ‌తం ప‌లికారు. ఫిబ్రవరి 11న జరిగే కార్పొరేష‌న్‌, మున్సిపల్ ఎన్నిక‌ల గురించి వారిద్ద‌రూ చ‌ర్చించారు. అనంతరం మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ మంచిర్యాల కార్పొరేషన్ లోని 60 డివిజన్ స్థానాలు, లక్షెట్టీపేట్ మున్సిపాలిటీలోని 15 కౌన్సిలర్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప‌ట్ణణ అధ్య‌క్షుడు తూముల న‌రేష్‌, నాయ‌కులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like