మద్యం మత్తులో ఓ కానిస్టేబుల్ వీరంగం
మద్యం మత్తులో ఓ కానిస్టేబుల్ వీరంగం సృష్టించాడు. అర్ధనగ్నంగా ఇంటి ఎదుట నానా హంగామా చేశాడు. చుట్టుపక్కల వాళ్లు తీసిన వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది… మంచిర్యాల జిల్లా కేంద్రంలో వెలుగుజూసిన ఈ షాకింగ్ ఘటన వివరాల్లోకి వెళితే…
రవి ప్రసాద్ అనే వ్యక్తి మంచిర్యాల పోలీస్ స్టేషన్ లో రైటర్ గా పని చేస్తున్నాడు. మద్యం మత్తులో నిన్న వీరంగం సృష్టించాడు. అర్ధనగ్నంగా ఇంటి ఎదుట నానా హంగామా చేశాడు. నడిరోడ్డుపై భార్యా, బిడ్డలను కిరాతకంగా చితకబాదాడు. కాళ్లు, చేతులు పట్టుకున్నా కనికరించకుండా ఇంటినుంచి గెంటేసినట్లు సమాచారం. నిన్న అంత హంగామా చేసిన ఆ కానిస్టేబుల్ ఈ రోజు తాపీగా ఉద్యోగం చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం అంతా స్థానికులు సెల్ ఫోన్‌లో రికార్డ్ చేయడం, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్‌గా మారింది. భార్య కూడా పోలీస్ శాఖలో ఉద్యోగం చేస్తున్నట్లు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.