హాస్ట‌ల్‌లో ఫుడ్ పాయిజ‌న్… 20 మంది విద్యార్థినుల‌కు అస్వ‌స్థ‌త‌

మంచిర్యాల జిల్లా బెల్లంప‌ల్లిలోని హాస్ట‌ల్‌లో జ‌రిగిన ఫుడ్ పాయిజ‌న్ ఘ‌ట‌న‌లో 20 మంది విద్యార్థినుల‌కు అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. వారిని వెంట‌నే ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు.

బెల్లంప‌ల్లి బ‌స్తీలోని స‌మీకృత పాఠ‌శాలలో నిన్న రాత్రి మిల్ మేక‌ర్ కూర వ‌డ్డించారు. అందులో పురుగులు ఉన్నాయి. ఆ విష‌యాన్ని విద్యార్థినులు వార్డెన్ దృష్టికి వెళ్లారు. అయినా ప‌ట్టించుకోలేదు. దీంతో అదే కూర తిన్న త‌ర్వాత పిల్ల‌లు వాంతులు చేసుకున్నారు. మ‌రికొంద‌రు సృహ కోల్పోయారు. చుట్టుప‌క్క‌ల వారు గ‌మ‌నించి త‌మ కార్లు, ఇత‌ర వాహ‌నాల ద్వారా పిల్ల‌ల‌ను బెల్లంప‌ల్లి ప్ర‌భుత్వ ఆసుప్ర‌తికి త‌ర‌లించారు. అక్క‌డ వారికి చికిత్స అందిస్తున్నారు. విష‌యం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికలను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యుల‌కు సూచించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like