మెడిక‌ల్ బోర్డు ర‌ద్దు కాలేదు…

CM Revanth Reddy:తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులు పోషించిన పాత్ర చారిత్రాత్మకమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఆయ‌న భూపాల‌ప‌ల్లిలో నిర్వ‌హించిన స‌భ‌లో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ సింగరేణి కార్మికుల మెడికల్ బోర్డు రద్దయిందన్న అసత్య ప్రచారాలు జరుగుతున్నాయని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అలాంటి విషపు ప్రచారాలను ప్రభుత్వం సహించబోదని సీఎం హెచ్చరించారు. మెడికల్ బోర్డు రద్దు కాలేదని, దాన్ని మరింత వేగంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ విషయంలో కార్మికులను తప్పుదోవ పట్టించే ప్రచారాలపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి శ్రీధర్ బాబు కార్మిక నేత జనక్ ప్రసాద్ ను కోరారు.

మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, సింగరేణి కార్మికుల చిరకాల వాంఛ అయిన సొంత ఇంటి పథకం త్వరలోనే సాకారం చేస్తామని హామీ ఇచ్చారు. మారుపేర్ల మార్పు అంశంపై న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నామన్నారు. ఈ విషయంపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని వెల్లడించారు. అలాగే మెడికల్ బోర్డు ప్రక్రియ మరింత వేగవంతం చేసేందుకు చర్యలు చేపడతామని, డిస్మిస్ కార్మికుల అంశంపై కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like