మ‌ళ్లీ పెరిగిన బంగారం, వెండి ధ‌ర‌లు..

Gold,Silver prices:నాలుగు రోజుల పాటు స్థిరంగా కొనసాగిన బంగారం, వెండి ధరలు సోమవారం మళ్లీ అమాంతం పెరిగాయి. బంగారం తులం రూ. 2,240 పెరిగింది. వెండి కిలోకు ప‌దిహేను వేల‌కు పెరిగింది. దీంతో కొనాలా…? వ‌ద్దా..? అని ఆగుతున్న జ‌నానికి మ‌ళ్లీ షాక్ త‌గిలింది.. ఈ రోజు ఉదయం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,58,840కి చేరింది. నిన్నటి ధరతో పోల్చుకుంటే 2,240 రూపాయలు పెరిగింది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,45,600కి చేరింది. నిన్నటి ధరతో పోల్చుకుంటే 2,050 రూపాయలు పెరిగింది.

వెండి ధ‌ర‌ కూడా భారీగా పెరిగింది. మళ్లీ రూ.3 లక్షల మార్క్‌కు చేరుకుంది. నిన్నటి ధరతో పోల్చుకుంటే కిలోకు ఏకంగా రూ.15 వేలు పెరిగింది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర ప్రస్తుతం రూ. 3 లక్షలుగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో కూడా కిలో వెండి ధర రూ.3 లక్షలుగా ఉంది.

You might also like