పంజాబ్ లో రైలు ప్రమాదం.. తగలబడుతున్న ఐదు భోగిలు
పంజాబ్‌లోని రాజ్‌పురా/పాటియాలా సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న అమృత్‌సర్ – కతిహార్ కర్మభూమి(12508) ఎక్స్‌ప్రెస్ రైలులో అగ్నిప్రమాదం సంభవించింది.
రైలులోని ఐదు కోచ్‌లకు భారీగా నిప్పు అంటుకుని దట్టమైన పొగలు అలుముకున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురై పరుగులు తీశారు.
సమాచారం అందిన వెంటనే రైల్వే అధికారులు, స్థానిక పోలీసులు, ఫైర్ బ్రిగెడ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు, ప్రయాణికులను సురక్షితంగా ఖాళీ చేయించేందుకు చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.