60 ఏండ్ల తర్వాత… కొండగట్టు అంజన్న చందనోత్సవం..
“ఏకంగా ఆరు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణ.. దేశంలోనే అరుదైన ద్విముఖ ఆంజనేయుడి నిజరూప దర్శన భాగ్యం..! కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి భక్తులకు ఇది నిజంగా కనుల పండువ లాంటి వార్త. సుమారు 60 ఏళ్ల తర్వాత కొండగట్టులో అత్యంత వైభవంగా స్వామివారి ‘చందనోత్సవం’ జరగనుంది. దశాబ్దాలుగా మూలవిరాట్టుపై పేరుకుపోయిన ఆరు అంగుళాల సింధూరాన్ని తొలగించి, అంజన్న నిజరూపాన్ని భక్తుల దర్శనార్థం ఉంచేందుకు ఆలయ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అసలు ఈ చందనోత్సవం ఎందుకు చేస్తారు? సింధూరం తొలగింపు వెనుక ఉన్న ప్రత్యేకతలు ఏంటి…”?
కొండగట్టు ఆంజనేయస్వామి చందనోత్సవాలకు దేవస్థానం ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. 60 ఏళ్ల అనంతరం స్వామి వారి చందనోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఆంజనేయస్వామి రెండు తలలతో ఉంటారు. తూర్పువైపు నారసింహస్వామి, ఉత్తరం వైపు ఆంజ నేయస్వామిగా భక్తులకు దర్శనం ఇస్తుంటారు.
ఆంజనేయస్వామి వారికి ప్రతీ మంగళ, శనివారం ఆలయ అర్చకులు సింధూర లేపనం వేయడం ఆన వాయి తీగా వస్తోంది. 60 ఏళ్ల క్రితం కొండ గట్టు ఆంజనేయస్వామికి చందనోత్సవం నిర్వహించారని తెలుస్తోంది. ప్రస్తుతం స్వామి వారి మూలవి రాట్టుపై ఆరు అంగుళాల మేరకు సింధూరం ఏర్పడింది. స్వామి వారి నిజరూప దర్శనం భక్తులకు లభించడం లేదు. దీంతో దేవస్థానం ఆధ్వర్యంలో నవంబరు 16 నుంచి 20 వరకు చందనో త్సవం నిర్వ హించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా మొద టి అయిదు రోజుల పాటు మూలవి రాట్టుపై గల సింధూరాన్ని ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి తొలగిస్తారు.
ఇందుకు చేపట్టే క్రతువుకు అర్చకులు పది రోజుల ముందు నుంచే దీక్షలు స్వీక రిస్తారు. రావి, జువ్వి, మర్రి, మేడి, దరిమి చెట్ల నుంచి కలప సేకరించి వాటితో సింధూరం తొలగి స్తారు. ఈ కార్యక్రమానికి ఇద్దరు పీఠాధిపతులు రానుండగా, యాగశాలలో 50 మంది రుత్వికులతో నిత్యం త్రికుండాత్మక యజ్ఞం నిర్వహిస్తారు. దీంతో పాటు ఆలయ రాజగోపురంపై సుదర్శన చక్రం, కళశ స్థాపనకు ఏర్పాట్లు చేస్తున్నారు. సింధూరం తొలగించిన అనంతరం నవంబరు 21 నుంచి 41 రోజుల పాటు ఆంజనేయ స్వామి నిజరూప దర్శనం కల్పించనున్నారు. సింధూరం తొలగించే అయిదు రోజుల పాటు అంజన్న మూలవిరాట్టు దర్శనం ఉండదని, ఆలయంలోనే ప్రత్యేకంగా కర్ర ఉత్సవమూర్తి, వేంకటేశ్వరస్వామి, మహాలక్ష్మి అమ్మవారి దర్శనాలు మాత్రమే ఉండనున్నాయని దేవస్థానం అధికారులు తెలిపారు.
ప్రతి పుష్కరకాలం కోసారి కొండగట్టు ఆంజనేయ స్వామి చందనోత్సవం నిర్వహించాలని భక్తులు కోరు తున్నారు. 60 ఏళ్లకు నిర్వహించడంతో భక్తులు మహా ద్బుత వేడుకను చూడలేకపోతున్నారని, 12 ఏళ్లకో సారి వచ్చే గోదావరి పుష్కరాల వేళ కొండగట్టులో చందనోత్సవం నిర్వహించాలని అంటున్నారు. దీనిపై దేవస్థానం అధికారులు, అర్చకులు ఆగమశాస్త్ర పండి తులతో చర్చలు జరిపి నిర్ణయం తీసుకోవాలని భక్తులు అంటున్నారు.