వివేక్ ఐ ల‌వ్ యూ

Balka Suman:రాష్ట్రంలో కాంగ్రెస్ అహంకారం.. దుర్మార్గం పరాకాష్టకు చేరింద‌ని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమ‌న్ స్ప‌ష్టం చేశారు. ఆయ‌న క్యాత‌న్‌ప‌ల్లిలో త‌న నివాసంలో విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడారు. మున్సిప‌ల్ ఎన్నిక సంద‌ర్భంగా క్యాత‌న్‌ప‌ల్లి మున్సిపల్ కౌన్సిల్ కార్యాలయంలో కాంగ్రెస్ కౌన్సిలర్లు తాగి వచ్చి మహిళా కౌన్సిలర్ల పైన అసభ్యకరంగా ప్రవర్తించారని దుయ్య‌బ‌ట్టారు. కౌన్సిల్ హాలులోనే మంత్రి వివేక్ మా కౌన్సిలర్లకు బ్లాంక్ చెక్కులు ఇచ్చి ప్రలోభ పెట్టే ప్రయత్నం చేశారని అన్నారు. జైలులో త‌న‌ని బాగా ఇబ్బంది పెట్టార‌ని చెబుతూ మంత్రి వివేక్‌కు బాల్క సుమ‌న్ ఐల‌వ్‌యూ చెప్పారు.

జైల్లో త‌న‌కు కనీస సౌకర్యాలు కల్పించలేదని సుమ‌న్ వెల్ల‌డించారు. దోమలున్న రూంలో పెట్టారని, త‌న‌కు క‌నీసం తాగడానికి నీళ్లు ఇవ్వలేదని, సక్రమంగా భోజనం కూడా పెట్టలేదన్నారు. చదువుకోడానికి పుస్తకాలు సైతం ఇవ్వలేదని తెలిపారు. కప్పుకోవడానికి దుప్పటి ఇవ్వకపోతే మా న్యాయవాది మూడు రోజుల పోరాటం చేశాక దుప్పటికి అనుమతించారని చెప్పారాయ‌న‌. గొంతు నొప్పి, ఫీవర్ వస్తే కనీసం టాబ్లెట్స్ ఇవ్వలేదని బాల్క‌సుమ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like