ఉధృతమైన విద్యుత్ ఉద్యోగుల ఆందోళన
మంచిర్యాల జిల్లాలో విద్యుత్ ఉద్యోగులు కొద్ది రోజులుగా ఆందోళన బాట పట్టారు. తమపై పెట్టిన అక్రమ కేసులు తొలగించాలని ఐదు రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఈ నెల 6న చెన్నూరులో విద్యుత్ ఉద్యోగులపై మునిసిపల్ కౌన్సిలర్లు దాడి చేశారు. పైగా తమపైనే కేసులు పెట్టారని ఉద్యోగులు చెబుతున్నారు. దీంతో ఐదు రోజులుగా మంచిర్యాల సర్కిల్ కార్యాలయం ముందు ఆందోళన చేస్తున్నారు. అయితే అటు ఉన్నతాధికారుల దగ్గర నుంచి కానీ, ఎక్కడి నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో సోమవారం దాదాపు ఆరు వందల మంది ఉద్యోగులు మాస్ లీవ్ పెట్టారు. స్వీపర్ నుండి జిల్లా అధికారి వరకు జిల్లా వ్యాప్తంగా మాస్ లివ్ పెట్టారు. తమపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు. విద్యుత్ అంతరాయానికి తాము బాధ్యులం కామని స్పష్టం చేశారు. భయపడుతూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పని చేయాల్సిన అవసరం లేదని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీజేపీ మద్దతు..
విద్యుత్ ఉద్యోగుల ఆందోళనకు బీజేపీ మద్దతు తెలిపింది. భారతీయ జనతా పార్టీ మద్దతు తెలిపింది. ఆ పార్టీ నేత వివేక్ వెంకటస్వామి హాజరై విద్యుత్ ఉద్యోగుల ఆందోళనకు మద్దతు పలికారు.