ఈ నెల 12న మంచిర్యాలకు కేటీఆర్
-జిల్లా బీఆర్ఎస్ సమావేశంలో పాల్గొననున్న కేటీఆర్
-కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలి : పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ విప్ బాల్క సుమన్
KTR:బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ నెల 12న మంచిర్యాల జిల్లాలో పర్యటించనున్నారు. మాజీ విప్, జిల్లా పార్టీ అధ్యక్షుడు బాల్క సుమన్ హైదరాబాద్ లో కేటీఆర్ ను కలిసి ఆహ్వానించారు. ఆదివారం ఉదయం 11గం. లకు నస్పూర్ జిల్లా పార్టీ కార్యాలయం- తెలంగాణ భవన్ లో జరిగే కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. భవిష్యత్ కార్యాచరణపై కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయనున్నారు. అనంతరం క్యాతనపల్లి మున్సిపాలిటీ నూతన పాలక మండలి సభ్యులను కేటీఆర్ సన్మానిస్తారు.
సమావేశం అనంతరం ఎంఎన్ఆర్ గార్డెన్ లో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కూతురి వివాహానికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదిస్తారు. అక్కడి నుంచి క్యాతనపల్లి మాజీ విప్ బాల్క సుమన్ ఇంటికి కేటీఆర్ చేరుకుంటారు. వివిధ సంఘాల నేతలతో సమావేశమవుతారు. అనంతరం మీడియాతో మాట్లాడనున్నారు. కేటీఆర్ పర్యటన నేపథ్యంలో మాజీ విప్, జిల్లా పార్టీ అధ్యక్షుడు బాల్క సుమన్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ శ్రేణులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొనాలని బాల్క సుమన్ పిలుపు నిచ్చారు.