మిస్ యూనివర్స్ కిరీటం మనదే
భారత్ కు 21 ఏళ్ల తర్వాత మిస్ యూనివర్స్ కిరీటం దక్కింది. పంజాబ్ కు చెందిన హర్నాజ్ కౌర్ సింధు ఈ టైటిల్ గెలుచుకుంది. పంజాబ్ కు చెందిన హర్నాజ్ కౌర్ మిస్ ఇండియాను గతంలో గెలుచుకుంది. భారత్ కు 21 ఏళ్ల తర్వాత మిస్ యూనివర్స్ టైటిల్ దక్కింది.
వెల్లువెత్తిన అభినందనలు..
1994లో లో సుస్మితా సేన్, 2000 సంవత్సరంలో లారా దత్తా, 2021లో హర్నాజ్ కౌర్ ఈ టైటిల్ సాధించారు. 70వ మిస్ యూనివర్స్ పోటీలు ఇజ్రాయిల్ లో జరిగాయి. మిస్ యూనివర్స్ గా ఎంపికయిన హర్నాజ్ కౌర్ కు దేశ వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.