అంబేద్క‌ర్ విశ్వ మాన‌వుడు..

అంబేద్క‌ర్ విశ్వ మాన‌వుడ‌ని అంబేద్కర్ యువజన సంఘం కొనియాడారు. తాండూరు మండ‌లం మాదారం టౌన్షిప్‌లో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో 135 జయంతి వేడుకలు ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు నేత‌లు మాట్లాడుతూ అంటరానితనం, కుల వ్యవస్థపై పోరాడుతూ, “చదువుకోండి, సమీకరించండి, పోరాడండిష‌ అనే నినాదంతో దళితులు, అణగారిన వర్గాల సామాజిక న్యాయం కోసం నిరంతరం కృషి చేశారని తెలిపారు. “నిజమైన విద్యావంతుడు తనకున్న జ్ఞానాన్ని సమాజ సేవకు ఉపయోగిస్తాడ”ని నమ్మిన అంబేద్కర్, కుల నిర్మూలన ద్వారా భారతదేశంలో అసలైన సామాజిక మార్పును ఆకాంక్షించారని స్ప‌ష్టం చేశారు.

కార్య‌క్ర‌మంలో అంబేద్కర్ యువజన సంఘం నాయకుడు ఆనంద్, బోడ సతీష్, కమలాకార్, తాండవ కృష్ణ, రాహుల్, వినోద్, మాదారం, కొత్తపల్లి సర్పంచ్‌లు కుశ్న‌ప‌ల్లి ల‌క్ష్మ‌ణ్‌, ఆకుల వెంకటేష్, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్య‌క్షుడు సూరం రవీందర్ రెడ్డి, బీజేపీ మండ‌ల అధ్య‌క్షుడు మహేందర్ గౌడ్, ఆకుదారి క్రాంతి కుమార్, శ్రీనివాస్, మహేష్, అరవింద్, రాజేందర్, వార్డు స‌భ్యులు సౌమ్య‌, ల‌క్ష్మి, ర‌వి, సాయి, కోడం సంతోష్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

You might also like