కాంగ్రెస్ కు రాథోడ్ బాపురావ్ గుడ్ బై..

బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆయన కాసేపట్లో కల్వకుంట కవిత సమక్షంలో జాగృతిలో చేరనున్నారు. మధ్యాహ్నం 1గంటకు తన అనుచరులతో కలసి కవిత సమక్షంలో చేరుతారు.

రాథోడ్ బాపురావ్ బీఆర్ఎస్ పార్టీతో రాజకీయ ప్రయాణం ప్రారంభించారు. 2014, 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బోథ్ నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2023లో బీఆర్ఎస్ టికెట్ నిరాకరించడంతో, ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని వీడి జాగృతిలో చేరనున్నారు.ఎన్నికల టికెట్ల కేటాయింపులు, రాజకీయ సమీకరణాల నేపథ్యంలో నేతలు పార్టీలు మారడం సాధారణమే అయినా, కీలక నియోజకవర్గమైన బోథ్ మాజీ ఎమ్మెల్యే నిర్ణయం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like