ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉద్రిక్తం

ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉద్రిక్తతకు దారి తీసింది. తమపై పోలీసులు చేయి చేసుకున్నారని కాంట్రాక్ట్ డ్రైవర్లు డిపో ఎదుట ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళితే…

తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం మంచిర్యాల ఆర్టీసీ డిపో వద్ద బస్సులు నిలిపివేశారు. ఈ నేపథ్యంలో బస్సులను నడిపించేందుకు అధికారులు కాంట్రాక్ట్ డ్రైవర్లను వినియోగించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో, బస్సు నడపాలని చెప్పినప్పటికీ ఓ డ్రైవర్ వినడం లేదంటూ ఏసీపీ ప్రకాష్ ఆ డ్రైవర్‌పై చేసుకున్నారని ఆర్టీసీ కార్మికులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. ఈ ఘటన అక్కడ ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మంచిర్యాల ఆర్టీసీ డిపో ముందు కాంట్రాక్ట్ డ్రైవర్లు, కండక్టర్లు ఆందోళనకు దిగారు. పోలీసులు నచ్చ చెప్పందుకు ప్రయత్నం చేసినా వినకుండా డిపో ఎదుట భైఠయించారు. అధికారులు వెంటనే స్పందించి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించినా వారు తమ ఆందోళన సాగిస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like