వడ్ల కొనుగోలు కేంద్రం వద్ద ఉద్రిక్తత
మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం ఆస్నాధ గ్రామం వడ్ల కొనుగోలు కేంద్రం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. గ్రామంలోని వడ్ల కొనుగోలు కేంద్రం వద్ద కాంగ్రెస్, బిఆర్ఎస్ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇటీవల కురిసిన భారీ వర్షానికి కొనుగోలు కేంద్రాల వద్ద తడిసిన వరి ధాన్యాన్ని పరిశీలించడానికి బిఆర్ఎస్ నాయకులు వెళ్లారు. దీంతో వారిని కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రానికి ఎందుకు వచ్చారంటూ కాంగ్రెస్ శ్రేణులు వాగ్వాదానికి దిగాయి. దీంతో అక్కడే ఉన్న రైతులు కలగజేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది.