16 మంది డిప్యూటీ కలెక్టర్ల బదిలీ

తెలంగాణ‌లో వివిధ జిల్లాల్లో స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్లు , డిప్యూటీ కలెక్టర్లుగా పనిచేస్తున్న మొత్తం 16 మంది అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది.

వివిధ జిల్లాలో స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లు గా పనిచేస్తున్న మొత్తం 16 మంది అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. వరంగల్‌లో అడిషనల్‌ కలెక్టర్‌గా పనిచేస్తున్న గట్టు సంధ్యారాణిని నిర్మల్‌ జిల్లాకు, నిర్మల్‌లో ఉన్న కిషోర్‌ కుమార్‌ను వరంగల్‌కు అదే హోదాలో బదిలీ చేశాఉ. సిద్దిపేటలో పనిచేస్తున్న డి.నాగరాజమ్మను అదే జిల్లాలో డీఆర్‌వోగా నియమించారు.

చీఫ్‌ ఎలక్టొరోల్‌ అధికారిగా ఉన్న దశరథ్‌ను నల్గొండ డీఆర్‌వోగా, మల్కాజిగిరిలో పనిచేస్తున్న మాలతిని అక్కడే డీఆర్‌వోగా నియ‌మించారు. డిప్యుటేషన్‌పై మైనారిటీ వెల్ఫేర్‌లో పనిచేస్తున్న నాగలక్ష్మిని మహబూబాబాద్‌ డీఆర్‌వోగా బదిలీ చేశారు. హనుమకొండలో ఆర్డీవోగా పనిచేస్తున్న రాథోడ్‌ రమేష్‌ను నిర్మల్‌ జిల్లా డీఆర్‌వోగా, జీఏడీలో ఉన్న ప్రేంరాజ్‌ను సూర్యాపేట డీఆర్‌వోగా బదిలీ చేశారు. వీరితో పాటు మరికొందరిని డీఆర్‌వోలుగా, ఆర్డీవోలుగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like