చిరుత పులి మృతి..
Leopard dies:మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా ముఖ్యంగా తాడోబా అంధారి టైగర్ రిజర్వ్.. దాని చుట్టుపక్కల ప్రాంతాలు వన్యప్రాణులకు, ముఖ్యంగా పులులు, చిరుతలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం. అటవీ ప్రాంతాల గుండా వెళ్లే రైల్వే ట్రాక్‌ల వల్ల అమాయక వన్యప్రాణులు తరచుగా ప్రాణాలు కోల్పోతున్నాయి. తాజాగా చంద్రాపూర్ జిల్లాలో రైలు ఢీ కొని చిరుత మృతి చెందింది. వీరూరు-మానిక్‌ఘర్ స్టేషన్ల మధ్య సింధీ నాలపై వంతెన వద్ద ఓ ఆడ చిరుతపులి రైలు ప్రమాదంలో మృతి చెందింది. అటవీశాఖ అధికారులు కళేబరాన్ని సమ్ రానా మొక్కల పెంపక క్షేత్రానికి తరలించి ఖననం చేశారు.