వర్షంలో చెట్టు కిందకు వెళ్లి దంపతుల మృతి

వర్షం నుండి కాపాడుకునెందుకు చెట్టు కిందకు వెళ్లి భార్యాభర్తలు మృతి చెందిన ఘటన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. రెబ్బెన మండలం కైరిగూడలో సంభవించిన పిడుగుపాటుకు భార్యా భర్తలు ఇద్దరు మృతి చెందారు. టెకం భీము (50), ఆయన భార్య రాజబాయి సహా ముగ్గురు పొలంలో వ్యవసాయ పనులు చేస్తున్నారు. ఈ సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి భారీ వర్షం ప్రారంభమైంది. వర్షం నుంచి రక్షణ కోసం సమీపంలోని ఓ చెట్టు కిందకు వెళ్లారు.

అయితే వారు నిలబడ్డ చెట్టుపైనే పిడుగు పడటంతో టెకం భీము, రాజబాయి అక్కడికక్కడే మృతి చెందారు. వారితో పాటు ఉన్న ఆత్రం గంగు తీవ్రంగా గాయపడగా, స్థానికులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ¾కళ్లముందే దంపతులు ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Get real time updates directly on you device, subscribe now.

You might also like