కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన ఇలా…
CM Revanth Reddy: కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటించనున్నారు. ఆయన రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవం రాష్ట్రవ్యాప్తంగా ఇక్కడ నుంచే ప్రారంభించనున్నారు. అదే సమయంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. జిల్లాలో ఆయన పర్యటన ఈ విధంగా సాగనుంది.. .
సాయంత్రం 4.40కి హైదరాబాద్ నుంచి బయల్దేరి కెరమెరి మండలం కొత్తారి గ్రామానికి చేరుకుంటారు…
సాయంత్రం 5:45 గంటలకు 25 ఇందిరమ్మ ఇండ్లకు ప్రారంభోత్సవం చేస్తారు… రాష్ట్రవ్యాప్తంగా రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఇక్కడ నుంచే సీఎం ప్రారంభించనున్నారు…
సాయంత్రం 6.30 వరకు లబ్ధిదారులతో ముఖ్యమంత్రి నేరుగా మాట్లాడతారు…
సాయంత్రం 6.55కు కాగజ్‌నగర్ ఎక్స్ రోడ్ వద్ద నిర్వహించనున్న భారీ బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకుంటారు…
6.55 నుంచి 7 గంటల వరకు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం.
7 గంటల నుంచి 8.30 వరకు ప్రజల ను ఉద్దేశించి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రసంగిస్తారు..
8.30కు రోడ్ ద్వారా బయల్దేరి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్ ఇంటికి వెళ్తారు…
రాత్రి పది గంటలకు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ నివాసం బయలుదేరి హైదరాబాద్ వెళ్తారు…