పతాకావిష్కరణ వివాదం..
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బెల్లంపల్లిలో రెండు పార్టీల మధ్య వివాదం నెలకొంది. పోలీసుల జోక్యంతో సద్దుమణిగింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి గంగారాం నగర్లో పతకావిష్కరణ విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తల మధ్య వివాదం చెలరేగింది. ఇరు పార్టీలు తామే ముందుగా జెండా ఆవిష్కరించాలని పట్టుబట్టడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు. దీంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.