తెల్ల‌వారుఝామున ఆర్టీసీ బ‌స్సు ప్ర‌మాదం

RTC bus accident:తెల్ల‌వారుఝామున ఆర్టీసీ బ‌స్సు ప్ర‌మాదానికి గురైంది. ఈ ప్ర‌మాదంలో డ్రైవ‌ర్‌కు స్వ‌ల్ప గాయాలు కాగా, అందులో ఒక్క ఏకైక ప్ర‌యాణికుడు సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డారు. వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లాలో తెల్లవారుజామున ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. మందమర్రి టోల్ గేట్ సమీపంలో ఉదయం 4 గంటల సమయంలో బస్సు బోల్తా పడింది. డ్రైవర్ నిద్రలోకి జారుకోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలు కాగా, బస్సులో ఉన్న ఏకైక ప్రయాణికుడు సురక్షితంగా బయటపడ్డాడు. కొత్తగూడెం నుంచి బెల్లంపల్లి వస్తున్న ఆర్టీసీ బస్సు ఈ ప్రమాదానికి గురైంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి, గాయపడిన డ్రైవర్‌ను ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like