నైతిక విజయం నాదే..
ఉమ్మడి ఆదిలాబాద్ ఎన్నికల్లో నైతిక విజయం తనదేనని స్వతంత్ర అభ్యర్థి పెందూర్ పుష్పారాణి స్పష్టం చేశారు. ఆమె ఎన్నికల కౌంటింగ్ అనంతరం మాట్లాడారు. తనను ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా భయపడకుండా ఎన్నికల్లో నిలిచానని స్పష్టం చేశారు. ఆదివాసీ మహిళలు సాధారణంగా బయటకు రారని, తాను మాత్రం ధైర్యంగా బయటకు వచ్చి పోటీ చేశానన్నారు. ఏకంగా అధికార పార్టీనే ఢీకొట్టినా అని చెప్పారు. నాకు ప్రజ సమస్యలే ముఖ్యమని పోటీలో ఉన్నట్లు వెల్లడించారు. పోటీలో ఉండి ఎన్నికలకు కారణమైన రోజే నేను నైతికంగా గెలిచానని మరోమారు స్పష్టం చేశారు. మొదటి నుంచి అండగా ఉన్న అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.