స్టే ఇవ్వలేం
ఉద్యోగుల విభజనకు సంబంధించిన విషయంలో ఇప్పుడు స్టే ఇవ్వలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. జిఓ నెం 317 పై రాష్ట్ర హైకోర్టులో దాఖలు అయిన వివిధ కేసుల్లో మంగళవారం విచారణ జరిగింది. పిటిషనర్ న్యాయవాదుల వాదనలు విన్న ధర్మాసనం జిఓ అమలు పై స్టే ఇవ్వడానికి నిరాకరించింది. ప్రభుత్వం జవాబు వినకుండా స్టే ఎలా ఇస్తామని ప్రశ్నించింది. ఈ విషయంలో ప్రభుత్వానికీ కౌంటర్ దాఖలు చేయడానికి రెండు వారాల గడువు ఇచ్చింది. ఈలోపు కేటాయింపులు ప్రక్రియ పూర్తి అవుతుందని మధ్యంతర ఆదేశాలు జారీ చేయాలని పిటీషనర్ తరుపు న్యాయవాది కోరారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న కేటాయింపులు, ఈ పిటీషన్ పై వెలువడే తుది తీర్పు కు లోబడి ఉండాలని ఆదేశాలు జారీచేసింది. G.O. 317కు వ్యతిరేకంగా ఫైల్ అయిన అన్ని కేసులనూ 4 వారాలకు వాయిదా వేసింది. వీటిపై తదుపరి విచారణ జనవరి 7న జరగనుంది.