కార్యకర్తల అకుంఠిత దీక్ష‌నే బీఆర్ఎస్ బ‌లం

కార్యకర్తల అకుంఠిత దీక్ష‌నే బీఆర్ఎస్ పార్టీ బలమని మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ అన్నారు. మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్న‌య్య ఆధ్వ‌ర్యంలో బీఆర్‌ఎస్ బెల్లంప‌ల్లి నియోజక వర్గ కార్యకర్తల సమ్మేళనం, సభ్యత్వ నమోదు, సర్‌ శిక్షణ తరగతుల సమావేశం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ పార్టీ సభ్యత నమోదు పూర్తిగా డిజిటల్ పద్ధతిలో నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని పిలుపునిచ్చారు.

ఉద్యమకారులు, క్రియాశీల నాయకులు అందరిని ఒక తాటి మీదికి వచ్చి భారీ ఎత్తులో స‌భ్య‌త్వ న‌మోదు చేయాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. కార్య‌క్ర‌మంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధ్య‌క్షుడు మిర్యాల రాజిరెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

You might also like