ఆయనో అబద్దాల రావు
హరీష్‌రావుపై భట్టి విక్రమార్క ఫైర్
ఆయనో అబద్దాల రావు.. రోజుకో అబద్ధం చెబుతూ అబద్దాల రావుగా మారిపోయాడని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Deputy Chief Minister Bhatti Vikramarka) బీఆర్ఎస్ నేత హరీష్‌రావు(BRS leader Harish Rao)పై విరుచుకుపడ్డారు. శనివారం మంచిర్యాల జిల్లాలో కారుణ్య నియామాకాల పిల్లలకు నియామక పత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హరీష్ రావు గతంలో మంత్రిగా చేసిన విషయం మర్చిపోయి అబద్దాలు చెప్పి అబద్దాల రావు గా మిగిలిపోయాడని ఎద్దేవా చేశారు. రోజుకో శాఖపై తన అక్కసు వెళ్ళగక్కుతున్నాడని భట్టి స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ నేతలు సింగరేణి వనరులు దోచుకున్నారని…రోజు కో ఒక్కటి కట్టు కథ అల్లుతున్నారని దుయ్యబట్టారు. దొంగే దొంగ అనే తీరుగా వ్యవహరించిన మీరు.. తప్పుడు ప్రచారం చేసి మీ అనునాయులకు కోల్ బ్లాక్ చెందేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు కావాల్సిన ప్రైవేట్ వ్యక్తులకు కోల్ బ్లాక్ వచ్చే విధంగా చేయలేదా…? అన్ని నేను లెక్కలతో చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని భట్టి విక్రమార్క వెల్లడించారు. హరీష్ రావు ఆడే అబద్ధాలు ప్రజలు ఎన్ని రోజులు నమ్ముతారని… ఒక్క రోజు, రెండు రోజులు నమ్ముతారు ప్రతి సారి నమ్మరని చెప్పారు.
త్వరలోనే మరి కొంత మందికి కారుణ్య ఉద్యోగ నియామక పత్రాలను అందజేస్తాని చెప్పారు భట్టి. నా పాదయాత్రలో అనేక మంది కార్మిక సోదరులు కలిశారు వారి గుండె చప్పుడు విన్నానని అన్నారు. దోపిడీ దారులు పెత్తందారుల కబంద హస్తాల్లో సింగరేణి నీ పడనియమని చెప్పామని, అలాగే సింగరేణిని కాపాడుకుంటున్నామని వెల్లడించారు. సింగరేణిలో పలు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. కేసీఆర్ అప్పులు రాష్ట్రానికి గుది బండగా మారాయని, నెలకు రూ. 7 వేల కోట్లు అప్పులు కట్టాల్సి వస్తుందన్నారు.
కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పొన్నం ప్రభాకర్, ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్సీ దండే విఠల్, మంచిర్యాల, బెల్లంపల్లి, భూపాలపల్లి, వైరా ఎమ్మెల్యేలు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, గడ్డం వినోద్, సత్యనారాయణ, మలోత్ రాందాస్ నాయక్, కలెక్టర్ కుమార్ దీపక్, సింగరేణి కార్మిక సంఘాల ప్రతినిధులు వాసిరెడ్డి సీతారామయ్య, జనక్ ప్రసాద్ హాజరయ్యారు.